కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసినప్పటికి రెండు గంటల తర్వాత వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలు అలుముకుని సుమారు గంటసేపు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి పట్టణంలోని శివారు కాలనీలు జలమయమయ్యాయి. పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల ఆవరణ ల్లో నీళ్లు చేరడంతో ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు.
జమ్మలమడుగులో జోరు వాన - జమ్మలమడుగులో భారీ వర్షాలు
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో జోరు వాన కురిసింది. అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది.
జమ్మలమడుగులో జడి వాన