కడప జిల్లా బద్వేలులో భారీ వర్షం కురిసింది. అరగంట పాటు కురిసిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. రాకపోకలు నిలిచిపోయాయి. సిద్ధవటం రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్, సి.ఎస్.ఐ చర్చి, పూలే విగ్రహం వద్ద మురుగునీరు రోడ్డుపై ప్రవహించింది.
బద్వేలులో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం - heavy rains in kadapa district badvel
రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన భారీ వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. కడప జిల్లా బద్వేలులో భారీ వానకు రోడ్లపై వర్షం నీటితోపాటు మురుగు నీరు ప్రవహించటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కొంతసేపు రాకపోకలు స్తంభించిపోయాయి.
బద్వేలులో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం