ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.. ప్రజలకు తప్పని కష్టాలు - heavy rains in kadapa district

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రహదారులపై నీరు నిలిచిపోవటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

రాష్ట్రంలో వర్షాలు.
రాష్ట్రంలో వర్షాలు.

By

Published : Nov 3, 2021, 4:20 PM IST

కడప జిల్లా బద్వేల్ పట్టణంలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సిద్ధవటం రోడ్డులోని పూలే సర్కిల్, సీఎస్ఐ చర్చి రహదారిలో మురుగు నీరు, వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జనజీవనం స్తంభించిపోయింది. ఆర్టీసీ గ్యారేజ్ లోకి వర్షపు నీరు చేరడంతో బస్సుల మరమ్మతులు నిలిచిపోయాయి. పై నుంచి వచ్చి చేరుతున్న నీటిని మోటార్ ద్వారా బయటకు పంపిస్తున్నారు.

కమలాపురం సమీపంలో పాగేరు వంక వంతెనపై నీటి ఉద్ధృతితో రాకపోకలు పూర్తిగా నిలిచాయి. వాహనాలు రెండు వైపులా ఆగిపోయాయి. ఎవరినీ నీటిలో దిగనీకుండా రెవెన్యూ సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. బీడీ కాలనీలో రాత్రి కురిసిన వర్షానికి ఇళ్లలో నీరు చేరాయి. రహదారులపై నీటి చేరికతో.. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో..
అల్పపీడనం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళంలో ఏకధాటిగా వర్షం కురుస్తోంది. జిల్లాలోని కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల మారిన నేపథ్యంలో.. చేతికి వచ్చిన పంటలు చేయి జారిపోతాయని రైతులు అందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:

రహదారే...శ్మశానమా...?

ABOUT THE AUTHOR

...view details