కడపలో బుధవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం తడిసి ముద్దయింది. నగరంలోని ప్రధాన రహదారులపై మోకాలు లోతు వరకు వర్షపునీరు నిలిచిపోయాయి. కడప మెయిన్ రోడ్డులోని ఏ వీధి చూసినా చెరువులను తలపించాయి.
కడప నగరంలో భారీ వర్షం.. - భారీ వర్షాలు
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కడపలో బుదవారం కురిసిన భారీ వర్షానికి నగరం మొత్తం నీటితో నిండిపోయింది. రహదారులపై మోకాలు లోతు వరకు వర్షపునీరు నిలిచింది. ఏ వీధి చూసినా చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు భయందోళన చెందుతున్నారు.
కడప నగరంలో జనజిీవనం అతలకుతలం
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నివాసాల్లోకి నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు.ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు, అంబేద్కర్ కూడలి, అప్సర రోడ్డు, ఎన్జీవో కాలనీ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు మురికి కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇది చదవండి :TS - AP WATER WAR: మా నీటికి ఎసరు.. తెలంగాణను అడ్డుకోండి
Last Updated : Jul 15, 2021, 11:00 AM IST