ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయచోటిలో వర్షం... రైతుల్లో హర్షం - rain in raya choti

కడప జిల్లా రాయచోటి ప్రాంతంలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. ఖరీఫ్ కింద సాగు చేసిన పనులకు వర్షం అనుకూలంగా ఉంటుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాయచోటిలో వర్షం...రైతుల్లో హర్షం
రాయచోటిలో వర్షం...రైతుల్లో హర్షం

By

Published : Sep 8, 2020, 11:36 PM IST

కడప జిల్లా రాయచోటి ప్రాంతంలో గత రెండు రోజులుగా వర్షం కురుస్తోంది. ఖరీఫ్ కింద సాగు చేసిన పనులకు వర్షం అనుకూలంగా ఉంటుందని రైతులు ఈ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటల కింద సాగులో ఉన్న వరి పంటతో పాటు మెట్ట భూముల్లో సాగిన వేరుశనగ పంటకు కాయ పట్టే దశలో ఉండటంతో నీటి అవసరం ఉంది.

ఇదే సమయంలో వర్షం రావడంతో పంటలు కళకళలాడుతున్నాయి. గత 3 ఏళ్లుగా వర్షాభావంతో పంటలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి పంట సాగు దశ నుంచి వర్షాలు అనుకూలించడంతో వరి పంట ఏపుగా పెరిగి కలుపు దశను దాటింది. వేరుశనగ గింజలు పట్టే దశలో ఉండటంతో సరిపడా నీటి శాతం లభించి కాయ నాణ్యత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details