జమ్మలమడుగులో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పలు మండలాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా మురికివాడ ప్రాంతాలు మురుగునీటితో నిండిపోయాయి. ఈ వర్షానికి ఈదురుగాలులు తోడయ్యాయి. కొన్ని గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. రోడ్లపైకి వస్తున్న నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బద్వేలు ఆర్టీసీ బస్టాండ్, సి.ఎస్.ఐ చర్చ్, నాలుగు రోడ్ల కూడలి వద్ద రహదారులు చెరువులను తలపించాయి. మురుగు కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది.
జిల్లా అంతటా వర్షం... రోడ్లన్నీ జలమయం - kadapa disrict latest rain news
రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడం వల్ల గత రెండు మూడు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. కడప జిల్లాలో కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రహదారులన్నీ జలమయం కాగా... లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది.
వర్షానికి రోడ్లన్నీ జలమయం
ఇదీ చదవండి :
ప్రకాశం జిల్లాలో పలు చోట్ల వర్షాలు