కడపలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం - లోతట్టు ప్రాంతాలు జలమయం
కడప జిల్లాలో తెల్లవారుఝామునుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బస్టాండ్ జలమయమైంది.
rain
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పలు మండలాల్లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జమ్మలమడుగు, పెద్దముడియం, కొండాపురం, మైలవరం, ముద్దనూరు తదితర ప్రాంతాల్లో పొలాలు నీటమునిగాయి. జమ్మలమడుగు ఆర్టీసీ బస్టాండ్ జలమయమైంది. వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కడప నగరంలో రోడ్లపై మోకాలు లోతు వరకూ వర్షపు నీరు నిలిచిపోయింది. మురుగు కాలువలు పొంగుతున్నాయి.