ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎం జగన్ కడప పర్యటనకు భారీ భద్రత - సీఎం జగన్ కడప పర్యటన న్యూస్

ముఖ్యమంత్రి జగన్ కడప పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు సీఎం కడప జిల్లాలో పర్యటించనున్నందున జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహిస్తున్నారు.

సీఎం జగన్ కడప పర్యటనకు భారీ పోలీసు భద్రత
సీఎం జగన్ కడప పర్యటనకు భారీ పోలీసు భద్రత

By

Published : Dec 22, 2020, 10:35 PM IST

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నుంచి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆధ్వర్యంలో కడపలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జగన్ ఇడుపులపాయకు చేరుకుంటారు. 24న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. 25న ఉదయం పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని...12 గంటలకు కడప విమానాశ్రయం నుంచి రాజమండ్రికి బయలుదేరి వెళ్లనున్నారు.

ఈ మేరకు సుమారు వెయ్యి మంది పోలీసులతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు కడప జిల్లాలో ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును పకడ్బందీగా అమలు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో వైద్యాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details