కరోనా వైరస్ దెబ్బకు అన్నీ రంగాలు కుదేలవుతున్నాయి. ప్రతీ రంగం భారీ నష్టాన్ని చవిచూస్తోంది. లాక్డౌన్ కారణంగా కడప జిల్లా ఆర్టీసీకి 30 కోట్ల భారీ నష్టం వాటిల్లింది. జిల్లావ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రతి రోజు కోటి రూపాయల ఆదాయం వచ్చే ఆర్టీసీకి లాక్డౌన్ వలన భారీగానే నష్టం వచ్చింది. ప్రతి రోజు రెండున్నర లక్షల మంది ప్రయాణికులతో 3 లక్షల కిలోమీటర్లు తిరిగే ప్రగతి రథాలు ఎక్కడకక్కడ నిలిచిపోవటంతో జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. బస్సుల రాకపోకతో నిత్యం రద్దీగా ఉండే కడప ఆర్టీసీ డిపో లాక్డౌన్ వలన బోసిపోయింది.
ఆగిన ప్రగతి రథం... కడప ఆర్టీసీకి భారీ నష్టం - కడప ఆర్టీసీ డిపోకు లాక్డౌన్ నష్టం
కరోనా దెబ్బకు ఆర్టీసీ చక్రం ఆగిపోవటంతో కడప ఆర్టీసీ డిపో భారీ నష్టం చవిచూసింది. లాక్డౌన్ వలన జిల్లాలో రవాణా వ్యవస్థ దెబ్బతింది. నిత్యం రద్దీగా ఉండే బస్సు డిపోలు ఇప్పుడు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
![ఆగిన ప్రగతి రథం... కడప ఆర్టీసీకి భారీ నష్టం heavy loss to kadapa rtc due to lock down](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6923829-337-6923829-1587727954598.jpg)
కడప ఆర్టీసీ డిపోకు భారీ నష్టం