కడప జిల్లాలోని కుందు, పెన్నా నదులు జల కళ సంతరించుకుంటున్నాయి. వీటిలో నీటి ప్రవాహం పెరిగింది. శనివారం ఉదయం కుందునదిలోకి 14 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా... ఆదివారం ఉదయానికి 16 వేల క్యూసెక్కులకు చేరుకుంది. పెన్నానదిలో 16 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా... 18 వేల 900 క్యూసెక్కులు చేరుకుందని అధికారులు తెలిపారు. ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
కుందూ, పెన్నా నదుల్లో పెరిగిన వరద ప్రవాహం - కుందు, పెన్నా నదులు
24 గంటల వ్యవధిలో కుందు నదిలో 2 వేల క్యూసెక్కులు, పెన్నానదిలో 2వేల 900 క్యూసెక్కులు వరద ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు.
కుందు, పెన్నా నదుల్లో పెరిగిన నీటి ప్రవాహం...