కడప జిల్లా పెద్దముడియం మండలం నెమల్లదిన్నె వద్ద కుందూనది పోటెత్తింది. నెమల్లదిన్నె వద్ద వంతెనపై నుంచి 3 అడుగుల మేర వరద ప్రవహిస్తుండటంతో బలపనూరు, ఉప్పులూరు, కొట్టాలపల్లె, జంగాలపల్లె తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
![in article image in article image](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-cdp-38-21-kundu-varada-av-ap10039_21082020225715_2108f_1598030835_1036.jpg)
కడప జిల్లా పెద్దముడియం మండలం నెమల్లదిన్నె వద్ద కుందూనది పోటెత్తింది. నెమల్లదిన్నె వద్ద వంతెనపై నుంచి 3 అడుగుల మేర వరద ప్రవహిస్తుండటంతో బలపనూరు, ఉప్పులూరు, కొట్టాలపల్లె, జంగాలపల్లె తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కర్నూలు జిల్లాలో కుందూ నదికి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. దీంతో శుక్రవారం సాయంత్రం పెద్దముడియం ఎస్సై కృష్ణం రాజు నాయక్ వంతెన వద్ద పరిస్థితిని పరిశీలించారు. ప్రజలెవ్వరూ వంతెనపై నుంచి రాకపోకలు జరగకుండా ఇరువైపులా ముళ్ల కంపలు అడ్డుగా ఉంచి జాగ్రత్త చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి:'వర్షపు నీటిని ప్రాజెక్టులకు మళ్లించడంలో ప్రభుత్వం విఫలం'