కడప జిల్లాలో మూడు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో.. పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. మైలవరం డ్యాం 10 గేట్లు ఎత్తి పెన్నా నదికి 20 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయటంతో పాటు.. కుందూ నది నుంచి 35 వేల క్యూసెక్కుల వరద నీరు పెన్నా నదిలో చేరుతోంది. వల్లూరు మండలం ఆదనిమ్మయపల్లె ఆనకట్ట వద్ద 18 వేల క్యూసెక్కుల నీరు ప్రవాహం కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
పెన్నా నదికి భారీగా వరద నీరు - కడపలో పెన్నా నది
పెన్నా నదిలో భారీగా వరద నీరు చేరుతోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదికి వరద పోటెత్తుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
![పెన్నా నదికి భారీగా వరద నీరు flood to penna river](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8826285-607-8826285-1600277376688.jpg)
పెన్నా నదికి భారీగా వరద నీరు