కడప నగరంలో రోజురోజుకూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఫలితంగా పోలీసులు, అధికారులు మళ్లీ లాక్డౌన్ విధించేందుకు సిద్ధమయ్యారు. ఆదివారం ఒక్కరోజే 56 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
నగరంలోని రాజా రెడ్డి వీధి, నకాష్, నబీ కోట తదితర ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. రాజారెడ్డి వీధిలో అత్యధిక కేసులు వెలుగు చూడటంతో పోలీసులు.. స్థానికులకు పాసులు మంజూరు చేశారు. అవి ఉన్న వారిని మాత్రమే కాలనీలోకి అనుమతిస్తున్నారు. రేపటి నుంచి మరింత కఠినంగా లాక్డౌన్ను అమలు చేస్తామని డీఎస్పీ సూర్యనారాయణ పేర్కొన్నారు.