ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాలి వాన బీభత్సం.. కోట్లలో పంట నష్టం - కడప జిల్లాలో పంట నష్టం తాజా వార్తలు

కడప జిల్లాలో అకాల వర్షం, భారీ ఈదురు గాలులు ఉద్యాన రైతుల పాలిట శాపంగా మారింది. బుధవారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు బీభత్సానికి మామిడి, అరటి, బొప్పాయి, టమోటా ఇతర ఉద్యాన పంటలు పూర్తిగా నేలరాలిపోయాయి. నాలుగు మాసాల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఉద్యాన దిగుబడులు ఒక్కరోజులో చేజారి పోవడం రైతులు తీవ్రంగా నష్టపోయారు.

havy rains in kadapa
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు

By

Published : Apr 30, 2020, 10:03 AM IST

అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు

కడప జిల్లాలో అకాల వర్షం, భారీ ఈదురు గాలులు ఉద్యాన రైతుల పాలిట శాపంగా మారింది. బుధవారం తెల్లవారుజామున రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పులివెందుల, కడప నియోజకవర్గాల్లోని వివిధ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు బీభత్సానికి మామిడి, అరటి, బొప్పాయి, టమోటా ఇతర ఉద్యాన పంటలు పూర్తిగా నేలరాలిపోయాయి. జిల్లాలోని 17 మండలాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ఉద్యాన అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక అంచనాలు రూపొందించారు. 1530 మంది రైతుల గాను సుమారు 1100 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా రూ. 15.14 కోట్ల మేర నష్టం జరిగిందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

ఏఏ ప్రాంతాల్లో ఏఏ పంటలకు నష్టం

రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, చక్రాయపేట, వీరబల్లి, సుండుపల్లి మండలాల్లో మామిడికి భారీ నష్టం వాటిల్లగా.. పులివెందుల, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అరటి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి మండలాల్లో తీగ టమోటా నేలపై వాలింది. గాలుల ప్రభావానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి..

పసుపు పంట కొనుగోలుకు రేపటి నుంచి టోకెన్లు

ABOUT THE AUTHOR

...view details