కడప పట్టణానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, బ్రౌన్ స్మారక గ్రంథాలయ రూపశిల్పి జానమద్ది హనుమచ్ఛాస్త్రి స్మారకంగా... ఏటా ప్రదానం చేసే పురస్కారాలను ఈసారి ముగ్గురికి అందజేయనున్నారు. జానమద్ది సాహితీ పీఠం-2019 సాహితీ సేవా పురస్కారాలను సుప్రసిద్ధ తెలుగు, హిందీ రచయిత... రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు ప్రదానం చేయనున్నారు. ఈయనతోపాటు ప్రముఖ సాహితీ విమర్శకులు, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డికీ ఇవ్వనున్నారు.
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు హనుమచ్ఛాస్త్రి పురస్కారం - yarlagadda lakshmi prasad
డాక్టర్ జానమద్ది హనమచ్ఛాస్త్రి జయంతి సందర్భంగా ఏటా ప్రదానం చేసే... స్మారక పురస్కారాలకు ఈసారి ముగ్గురు ఎంపికయ్యారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు పురస్కారం ప్రదానం చేయనున్నారు.
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌కు హనుమచ్ఛాస్త్రి పురస్కారం
జానమద్ది సాహితీ పీఠం నుంచే గ్రంథాలయ సేవా పురస్కారాన్ని రాష్ట్ర గ్రంథాలయ కార్యదర్శి రావి శారదకు ప్రదానం చేయనున్నారు. అక్టోబరు 20న డాక్టర్ జానమద్ది హనమచ్ఛాస్త్రి 95వ జయంతి సందర్భంగా కడపలో జరిగే సభలో ముగ్గురికి పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. గత ఏడేళ్లుగా సాహిత్యం, గ్రంథాలయంలో విశేష సేవలందించిన వారికి సాహితీ పీఠం ఈ అవార్డులు ప్రదానం చేస్తోందని పీఠం మేనేజింగ్ ట్రస్టీ జానమద్ది విజయభాస్కర్ తెలిపారు.
ఇదీ చదవండీ...'రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరైనవే'