చేనేత కార్మికులు కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. వైఎస్సార్ నేతన్న నేస్తం చేనేత ఉప వృత్తుల వారికి కూడా అమలు చేయాలని చేనేత ఐక్య వేదిక జాతీయ కన్వీనర్ మల్లికార్జున్ డిమాండ్ చేశారు. నూలు వడికే వారు, రాట్నం తిప్పేవారు, రంగులు అద్దేవారు కూడా చేనేత కార్మికులేనని ఆయన తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ చేనేత కార్మికుల బతుకులు మాత్రం మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'చేనేత ఉపవృత్తులకు.. నేతన్న నేస్తం అమలు చేయాలి' - కడపలో చేనేత కార్మికుల ధర్నా తాజావార్తలు
చేనేత కార్మికులు కడపలో ధర్నా చేపట్టారు. చేనేత ఉప వృత్తుల వారికి వైఎస్సార్ నేతన్న నేస్తం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నా చేస్తున్న చేనేత కార్మికులు