ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప ఆబ్కారీ డిపో వద్ద హమాలీల ధర్నా - కడపలో హమాలీల నిరసన

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప ఆబ్కారీ డిపో వద్ద హమాలీలు ధర్నా నిర్వహించారు. తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

hamali  workers protest at kadapa
కడప ఆబ్కారీ డిపో వద్ద హమాలీల ధర్నా

By

Published : Jun 17, 2020, 1:14 PM IST

సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కడప ఆబ్కారీ డిపో వద్ద హమాలీలు ధర్నా చేపట్టారు. హమాలీలను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ సమయంలో హమాలీలకు అడ్వాన్స్​గా ఇచ్చిన రూ. 5 వేలను ఆర్థిక సహాయంగా ప్రకటించాలని కోరారు. ఒక్కో పెట్టెకు ప్రస్తుతం ఇస్తున్న 5 రూపాయలను... 20 రూపాయలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details