ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప హజ్​హౌస్​లో అసాంఘిక కార్యక్రమాలా..! కార్యాచరణ సిద్దం చేస్తామంటున్న ముస్లిం నాయకులు - హజ్ యాత్రకు2023

Haj Yatra: కడప శివారులోని హజ్ హౌస్ వాడుకలోకి తీసుకొచ్చేందుకు అక్కడి నుంచే హజ్ యాత్ర కొనసాగేందుకు పోరాడతామని ముస్లిం సంఘాల నాయకులు తీర్మానం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షలతోనే హజ్ హౌస్‌ను ఉపయోగంలోకి రాకుండా చేసిందన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Feb 12, 2023, 8:37 PM IST

Haj Yatra: కడప శివారులో నిరుపయోగంగా ఉన్న హజ్ హౌస్ ను ఉపయోగంలోకి రావాలంటే హజ్ యాత్ర కడప హజ్ హౌస్ నుండే కొనసాగేందుకు పోరాడుదామని ముస్లిం సంఘాల నాయకులు తీర్మానం చేశారు. కడపలో ఆదివారం సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ ఆధ్వర్యంలో హజ్ హౌస్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు కోసం పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, రాజకీయ నాయలతో సమావేశం ఏర్పాటు చేశారు. 2019 లో 26 కోట్లు వెచ్చించి అప్పటి ప్రభుత్వం రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కడప పట్టణంలో హజ్ హౌస్ ఏర్పాటు చేసి కడప ఎయిర్ పోర్ట్ ను అంతర్జాతీయ ఎయిర్ పోర్టుగా తీర్చిదిద్ది, హజ్ యాత్ర ఇక్కడ నుండే కొనేసాగేలా యోచించింది. అయితే 2019 లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్షతో హజ్ హౌస్ ను నిర్లక్ష్యంతో వ్యవహరించి ఉపయోగంలోకి రాకుండా చేసిందన్నారు. హజ్ యాత్ర ముస్లిం మైనార్టీలపై విధిగా ఉంది. అరబ్ దేశాలకు వెళ్లాలన్న, రావాలన్నా నేరుగా కడప నుండే ప్రయాణం సాగించవచ్చన్నారు. ఏ విధంగా చూసినా ప్రభుత్వానికి లాభదాయకం. ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందన్నారు. అలాగే ముస్లిం మైనార్టీలకు సంబంధించిన శాఖలు సైతం హజ్ హౌస్ నుండే నేరుగా సేవలు అందించవచ్చన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈనెల 15న ముస్లిం పెద్దలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ చేపడతామని సమావేశంలో తీర్మానించారు.

ముస్లింలను గౌరవిస్తూ గత ప్రభుత్వం హజ్​ను నిర్మిస్తే, దీనిని పూర్తిగా తుంగలో తొక్కేసి, అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈనెల 15న రాయలసీయ రాజకీయ, మత పెద్దలు పాల్గోని మీ సలహాలు, సూచనలు ఇవ్వగలరు.- సలావుద్దీన్, ముస్లిం సంఘసేవకుడు


హజ్ కోసం మా ప్రాణ త్యాగాలకైనా సిద్ధం చేసి మేము కాపాడుకుంటాము. పవిత్రమైన స్థలము. హజ్ యాత్ర అంటే మరలా తల్లి కడుపులో పుట్టిన విధంగా భావిస్తాము. అటువంటి హజ్​ను గాలికి వదిలేశారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుండాయి. - అమీర్ బాబు, టీడీపీ ఇంచార్జ్

రాజకీయ కక్షలతో వైఎస్సార్సీపీ హజ్ హౌస్‌ను ఉపయోగంలోకి రానివ్వలేదు: ముస్లిం నాయకులు

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details