కడప జిల్లాలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా కడప నగరానికి నిషేధిత గుట్కా, గంజాయి అక్రమంగా రవాణ అవుతోందనే సమాచారం మేరకు కడప జిల్లా ఒకటో, రెండో పట్టణ పోలీస్ స్టేషన్, చిన్నచౌకు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసులు వివిధ ప్రైవేటు గోదాములపై దాడులు చేశారు. గౌస్నగర్కు చెందిన ఓ ప్రైవేటు గోదాము నుంచి వాహనంలో తరలిస్తున్న రూ.20 లక్షల విలువు చేసే గుట్కా సంచులను పోలీసులు గుర్తించారు. జిల్లాకు చెందిన మేడా రమేష్ బాబు, పెనుబాల శివప్రసాద్, చారు విష్ణు క్రాంత్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
రూ.20 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - కడపలో రూ.20 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
కడప జిల్లాలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు భారీగా పట్టుబడ్డాయి. హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాల నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.20 లక్షల విలువ గల గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న రూ.10 లక్షల నగదు స్వాధీనం