కడపలో 6 లక్షల విలువైన గుట్కా స్వాధీనం - 6 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
కడప మేకలదొడ్డి వీధిలో గుట్కా విక్రయిస్తున్న ఇద్దరిని విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల సుధాకర్‌రెడ్డి, భాస్కర్ నుంచి 6 లక్షల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
gutka-swadenam
కడపలో గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న వారినివిజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులుగుర్తించి.. ఆరు లక్షల రూపాయలు విలువచేసే సరకు స్వాధీనం చేసుకున్నారు. కడప మేకలదొడ్డి వీధికి చెందిన సుధాకర్ రెడ్డి, భాస్కర్ బెంగళూరు నుంచి బస్తాల్లో గుట్కా తీసుకొస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఓ ఇంట్లో ఉంచి వ్యాపారస్తులకు విక్రయించేవారు. విషయం తెలుసుకున్న అధికారులు తనిఖీ చేసి నిషేధిత సరకు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.