కడప జిల్లా పులివెందులలో రూ.4.25లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి గుట్కా ప్యాకెట్లతో వస్తున్న లారీ పులివెందుల-కదిరి మార్గంలోని నామాలగుండు వద్ద మరో లారీని ఢీ కొట్టింది. అనంతరం లారీలో నుంచి బొలెరో వాహనంలోకి గుట్కా ప్యాకెట్లను మారుస్తుండగా... పోలీసులు దాడులు చేసి సరకు స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల అర్బన్ సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పులివెందులలోని గుట్కా స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసినట్లు చెప్పారు.
రూ.4.25 లక్షలు విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - gutka packets seized in kadapa district
కడప జిల్లా పులివెందులలో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.4.25 లక్షల విలువ చేసే సరకును స్వాధీనం చేసుకున్నారు.
gutka packets seized in pulivendhula