కడప జిల్లా పెద్దముడియం మండలం గుండ్లకుంటలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియ రసాబాసగా మారింది. విద్యార్థుల తల్లిదండ్రులు నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కౌన్సెలింగ్‌ను అడ్డుకుని కళాశాల ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానికంగా చదివే విద్యార్థులు బయటకెళ్లి చదువు కోవడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గందరగోళం మధ్య కౌన్సెలింగ్ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశారు.
కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న తల్లిదండ్రులు - kadapa district gurukul schools latest news
గురుకుల పాఠశాలలో ప్రవేశాల కోసం నిర్వహించిన కౌన్సెలింగ్‌ను అధికారులు తాత్కాలికంగా వాయిదా వేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌ను బాయ్‌కాట్ చేసి కళాశాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
కౌన్సిలింగ్‌ను బాయ్‌కాట్ చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు