కరువుకు నెలవైన కడప జిల్లాలో బోరుబావి కోసం 1000 అడుగులు తవ్వినా... నీరు వస్తాయన్న నమ్మకంగా లేదు. ఎంతో మంది రైతులు బోరు వేసినా నీరు రాక తీవ్రంగా నష్టపోయారు. చిన్నమండెం మండలం పులికరిచినవాండ్లపల్లికి చెందిన మల్రెడ్డి అనే రైతు ... 1996లో తన పొలంలో సాగునీటి కోసం 600 అడుగుల లోతు బోరు వేశారు. తొలుత కొద్దిపాటి నీరు వస్తుండటంతో... పదేళ్లపాటు పొలానికి వినియోగిస్తూ వచ్చారు. తర్వాత బోరు ఒట్టి పోయింది. తాజాగా జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు భూగర్భజలాలు పెరగటంతో... ఆ బోరు నుంచి మోటర్ వేయకుండానే నీరు ఉబికి వస్తోంది. దీంతో ఆ రైతు ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది.
ఉబికి వస్తున్న నీరు...రైతు ఇంట ఆనందం
ఏన్నో ఏళ్లుగా కరువుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆ ప్రాంతం నేడు జలకళను సంతరించుకుంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు ఒట్టిపోయిన బోర్ల నుంచి నీరు ఉప్పొంగడంతో ఆ రైతు ఇంట ఆనందం వెల్లువిరుస్తోంది.
ఉబికి వస్తున్న నీరు