కరోనా కేసుల వల్ల కంటైన్మెంట్ జోన్ ఆంక్షలతో ఉన్న కడప జిల్లా వేంపల్లి పంచాయతీ ... గ్రీన్ జోన్ గా మారింది. ఈ మేరకు కలెక్టర్ సి.హరికిరణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. వేంపల్లిలో రెండు పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కంటైన్మెంట్ జోన్ అయ్యింది. ఆఖరి కేసు 1.4.2020న నమోదు అయింది. పాజిటివ్ వచ్చిన ఆఖరి కేసు కూడా 16.04.2020 నెగిటివ్ రిపోర్డు రావటంతో డిశ్చార్జి చేశారు. గడిచిన 28రోజుల్లో పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.
గ్రీన్‌జోన్‌లోకి వేంపల్లి... కలెక్టర్ ప్రకటన - vempally green zone latestnews
కడప జిల్లా వేంపల్లి పంచాయతీ గ్రీన్ జోన్ లోకి వచ్చింది. ఒకరు పాజిటివ్ వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 28 రోజులుగా ఒక్క కేసు నమోదు కాకపోవటంతో గ్రీన్ జోన్ గా ప్రకటించినట్టు కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు.
గ్రీన్ జోన్ లోకి వేంపల్లి...కలెక్టర్ ప్రకటన