కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం... చక్రస్నానం నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఏకాంతంగా ఈ కార్యక్రమాన్ని జరిపారు. ఉదయం 4.00 గంటలకు సుప్రభాతంతో కార్యక్రమం మొదలవగా... స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు నవకలశ స్నపనతిరుమంజనం నిర్వహించారు. అనంతరం వేదమంత్రోచ్ఛారణ నడుమ శాస్త్రోక్తంగా గంగాళంలో చక్రస్నానం నిర్వహించారు. గురువారం రాత్రి 7.00 గంటలకు ధ్వజావరోహణంతో శ్రీకోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. శుక్రవారం పుష్పయాగం నిర్వహించనున్నారు.
ముగిసిన ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు - ontimitta latest news
కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీకోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరి రోజైన గురువారం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు.
ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు