ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైభవంగా గౌరమ్మ నిమజ్జనోత్సవం - gouramma devoties at kadapa latest news update

కడప జిల్లా రాజంపేటలోని కొలిమిలో పసుపుతో చేసిన గౌరమ్మ ప్రతిమకు మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాణసంచా పేల్చుతూ.. డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి నిమజ్జనోత్సవ ఊరేగింపు ఘనంగా జరిగింది. మహిళలతోపాటు పిల్లలు సైతం గౌరమ్మ పాటలు పాడుతూ సందడి చేశారు.

grand celabrations gouramma
వైభవంగా గౌరమ్మ నిమజ్జనోత్సవం

By

Published : Jan 19, 2020, 10:52 AM IST

వైభవంగా గౌరమ్మ నిమజ్జనోత్సవం

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గౌరమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. కడప జిల్లా రాజంపేటలోని కొలిమిలో పసుపుతో గౌరమ్మ ప్రతిమను తయారుచేసి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సైతం పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు చేసేందుకు తరలివచ్చారు. గౌరమ్మ ప్రతిమ చుట్టూ చిన్న పిల్లలు సైతం చేరి గొబ్బెమ్మ పాటలు పాడారు. బాణసంచా పేల్చుతూ... డప్పు వాయిద్యాల మధ్య అమ్మవారి నిమజ్జనోత్సవ ఊరేగింపు ఘనంగా జరిగింది.

ABOUT THE AUTHOR

...view details