రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలోని వైఎస్సార్ హార్టికల్చర్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పరిశీలించారు. అక్కడ తీసుకుంటున్న చర్యల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్వారంటైన్లో ఉన్న 93 మందికి మెరుగైన సేవలు, నిర్ణయించిన మేరకు పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు. మాస్కులు, శానిటైజర్ల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వహించాలని సూచించారు.
క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ - mla srinivasulu visited anantharajupeta quarantine centre
అనంతరాజుపేటలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సందర్శించారు. అక్కడ ఉంటున్న 93 మందికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలిచ్చారు.
![క్వారంటైన్ కేంద్రాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ govt whip koramutla srinivasulu visit anantharajupeta quarantine centre in kadapa district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7599889-659-7599889-1592046249983.jpg)
క్వారంటైన్లో ఇస్తున్న ప్రజల బాగోగుల అడిగి తెలుసుకుంటున్న ప్రభుత్వ విప్