ఒంటిమిట్టలో గవర్నర్ దంపతులు - ap politics
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామిని గవర్నర్ దంపతులు దర్శించుకున్నారు. సతీసమేతంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రత్యేక పూజలు చేశారు.
కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయాన్ని గవర్నర్ దంపతులు సందర్శించారు. కడప నుంచి రోడ్డు మార్గంలో ఒంటిమిట్ట కు చేరుకున్న గవర్నర్ నరసింహన్ దంపతులకు కలెక్టర్ హరికిరణ్, తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో లక్ష్మీకాంతం, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మలు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో కోదండరాముని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను తితిదే జేఈవో లక్ష్మీకాంతం అందజేశారు. కోదండరాముని కృపతోరాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని గవర్నర్ నరసింహం ఈ సందర్భంగా తెలిపారు.