కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని చిట్వేలు మండలంలో నిరు పేదలకు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ధర్మాపురం, లక్ష్మీనగర్‌లో అన్నదానం నిర్వహించారు. రైల్వే కోడూరు మండలం కొత్తపల్లిలో పేదలకు బియ్యం, కూరగాయలు అందజేశారు. అనంతరం క్రిమిసంహారక మందులను పిచికారి చేశారు. రైల్వే కోడూరు పట్టణంలో భాజపా నాయకులు వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో 150 మందికి అన్నదానం నిర్వహించారు.
పేదలకు సరుకుల పంపిణీ - రైల్వేకోడూరులో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ
రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని నిరుపేదలకు ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
![పేదలకు సరుకుల పంపిణీ government VIP distributes essential goods to poor people at railwaykoduru in kadapa](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6802311-651-6802311-1586958981181.jpg)
రైల్వేకోడూరులో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ