Government Teacher Commits Suicide In Kadapa: వైఎస్సార్ కడప జిల్లా కలసపాడులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన బీ కోడూరు మండలం మేకూరుపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయన భార్య రత్న ప్రైవేటు విద్యాసంస్థలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. అయితే వీరికి సంతానం లేదు. పిల్లలు లేరని వీరు కొద్ది రోజులుగా మనస్థాపానికి గురవుతున్నారు. స్కూల్ కి వెళ్తున్నానని చెప్పి భార్యను ప్రైవేట్ స్కూల్‌కి పంపించిన రాజేంద్రప్రసాద్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య రత్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మనస్థాపంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య - కడప జిల్లా తాజా వార్తలు
Government Teacher Commits Suicide In Kadapa:వైఎస్సార్ కడప జిల్లా కలసపాడులో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజేంద్రప్రసాద్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పిల్లలు లేరని కొద్ది రోజులుగా ఆయన మనస్థాపానికి గురవుతున్నట్లు తెలిసింది.
ATMAHATYA