గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. కడప జిల్లా రాయచోటిలో మంగళవారం ఆయన పర్యటించారు. పట్టణ సమీపంలోని సుండుపల్లి రోడ్డు మార్గంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను పరిశీలించారు. చంద్రబాబుపై కోపాన్ని పేదలపై చూపొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
చంద్రబాబుపై కోపాన్ని పేదలపై చూపకండి: శ్రీనివాస రెడ్డి - tdp leader srinivasa reddy news
టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అప్పగించాలని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుపై కోపాన్ని పేదలపై చూపవద్దని ప్రభుత్వాన్ని కోరారు.
tdp leader srinivasa reddy
ఇళ్ల స్థలాల పంపిణీలో వైకాపా నేతల అక్రమాల వల్ల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. స్థానిక శాసన సభ్యుడు కేవలం చంద్రబాబును తిట్టి ప్రభుత్వంలో పదోన్నతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిపైన ఆయనకు ధ్యాస లేదన్నారు. అంతకుముందు వీరభద్ర స్వామి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎంపిక అయిన తర్వాత తొలిసారిగా రాయచోటికి రావటంతో పార్టీ శ్రేణులు ఆయనను సత్కరించారు.