ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలోని కరోనా కేసుల్లో 70మందికి దిల్లీ లింకు

రాష్ట్రంలో కరోనా అలజడి స్పష్టిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరగటంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. ఏపీలో మొత్తం కరోనా పీడితుల సంఖ్య 87కు చేరిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే అధికంగా ఉన్నట్లు తెలిపింది.

ap corona cases
ap corona cases

By

Published : Apr 1, 2020, 10:01 PM IST

రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్​ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం సాయంత్రం 7 గంటల వరకు మొత్తం 87 పాజిటివ్ కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయని అందులో పేర్కొన్నారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 96 శాంపిల్స్​ను పరీక్షించగా అన్ని నెగిటివ్​గా తేలినట్లు చెప్పారు. రాష్ట్రవాప్తంగా మొత్తం 1313 మంది శాంపిల్స్ తీసుకున్నామని వెల్లడించారు. ఇందులో 1226 నెగెటివ్ రాగా...87 పాజిటివ్ కేసులు వచ్చాయని తెలిపారు.

జిల్లాల వారీగా కరోనా పరీక్షల వివరాలు

కరోనా పాజిటివ్​ వచ్చిన వారిలో అత్యధికులకు దిల్లీ లింకు ఉన్నట్లు వెల్లడించారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారిలో 10 మంది వారి సన్నిహితులు 6 మంది, దిల్లీ నుంచి వచ్చిన వారిలో 64 మందికి, వారి సన్నిహితులు 6 మందితోపాటు మరొకరికి కలిపి మొత్తం 87 మందికి కొవిడ్-19 పాజిటివ్​గా నిర్ధరణ అయిందని వెల్లడించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి సన్నిహితులందరినీ స్వీయ నిర్భంధంలోకి పంపినట్లు హెల్త్​ బులెటిన్​లో వెల్లడించారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు

రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దిల్లీలో తబ్లిఘి జమాత్ పేరుతో జరిగిన సమావేశానికి వెళ్లిన వారి సమాచారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు ఇచ్చారని హెల్త్​ బులెటిన్​లో వెల్లడించారు.

ఇదీ చదవండి:కన్నతల్లి మరణించినా.. విధుల్లోనే ఎస్​ఐ

ABOUT THE AUTHOR

...view details