ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రత్యేక హోదా ఇస్తారా..? లేదా..? భాజపా సూటిగా సమాధానం చెప్పాలి- శ్రీకాంత్ రెడ్డి - చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

భాజపా, తెదేపాల తీరుపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి హోదా ఇస్తారా లేదా? అనే విషయాన్ని భాజపా సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. నాడు తెదేపా ప్రభుత్వం హోదాను పక్కనబెట్టి.. ప్యాకేజీకి ఆమోదం చెప్పిన విషయం గుర్తుకు లేదా అని నిలదీశారు.

government Chief Whip Srikanth Reddy
government Chief hip Srikanth Reddy

By

Published : Feb 13, 2022, 8:04 PM IST

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందా? లేదా అనేది కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సూటిగా చెప్పాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నాడు తెలుగుదేశం పార్టీ తమకు హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీనే కావాలని చెప్పిన మాటను మరిచారా? అని ప్రశ్నించారు.

ఏపీకి ప్రత్యేక హోదా సంజీవిని అనే నినాదంతోనే వైకాపా ఉందనే విషయాన్ని భాజపా, తెదేపా నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. కడపలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి హోదా కోసం అనేకసార్లు పోరాటం చేశారని చెప్పారు.

నీచ రాజకీయాలు చేసే సంస్కృతి వైకాపాకు లేదన్నారు. ఫోర్జరీ కేసులో ఎమ్మెల్సీ అశోక్ బాబును అరెస్ట్ చేస్తే తేదేపా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం కోసం వైకాపా ఎప్పుడూ ముందంజలోనే ఉంటుందని చెప్పారు.

ఇదీ చదవండి

జగన్ రెడ్డికి 'అస్కార్' కాదు.. 'మోసకార్ అవార్డు' ఇవ్వాల్సిందే -

ABOUT THE AUTHOR

...view details