Governer Bishwabushan Harichandan: ఉన్నత విద్యావ్యవస్ధలో జాతీయ విద్యా విధానం-2020 కీలక మార్పులకు శ్రీకారం చుట్టిందని.. గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. కడప యోగి వేమన విశ్వవిద్యాలయం తొమ్మిది, పదో స్నాతకోత్సవాలు శుక్రవారం నిర్వహించారు. విశ్వవిద్యాలయ కులపతి హోదాలో రాజ్‌భవన్ నుంచి.. హైబ్రీడ్ విధానంలో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు.
యోగి వేమన విశ్వవిద్యాలయం స్ధాపించిన పదిహేనేళ్ల వ్యవధిలోనే.. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌ను సాధించిందని గుర్తుచేశారు. తొలి 150 విద్యాసంస్థల్లో ఒకటిగా నిలవడంతో పాటు న్యాక్ 'బి' గుర్తింపు పొందటంపై ఆనందం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేసిన.. విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ ఎం.సూర్య కళావతి, విశ్వవిద్యాలయ అధ్యాపక, అధ్యాపకేతర బృందాన్ని గవర్నర్ ప్రశంసించారు. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, రీసెర్చ్ స్కాలర్లు, గోల్డ్ మెడల్ అవార్డు గ్రహీతలను అభినందించారు.