కడప జిల్లావ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు లోతట్టు ప్రాంతాలు, జాతీయ రహదారులు, పంట పొలాలు నీట మునిగిపోయాయి. గోటూరు వంతెనపై నీరు చేరి బ్రిడ్జి కుంగిపోయింది.
భారీ వర్షాలకు కుంగిన గోటూరు వంతెన
ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కడప జిల్లాలోని గోటూరు వంతెనపై నీరు చేరి...బ్రిడ్జి కుంగిపోయింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.
కమలాపురం నియోజకవర్గంలో భారీస్థాయిలో వర్షాలు కురవటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలలోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. కడప-ఎర్రగుంట్ల జాతీయ ప్రధాన రహదారిపై వంతెన కూలిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఓ వైపు పాపాగ్ని, పాగేరు...మరోవైపు కుందూ, పెన్నా నదులు పొంగి ప్రవహిస్తుండటంతో...లోతట్టు ప్రాంతాలన్నీ నీటి దిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ఇదీ చదవండి:గండికోట జలాశంలోకి భారీగా వరదనీరు.. ముంపు గ్రామాల్లో బాధితుల కష్టాలు