నిత్యావసరాలు పంచిన ఎమ్మెల్యే మల్లికార్జున్ రెడ్డి - latest news of covid cases
కడప జిల్లా రాజంపేట పురపాలికలో ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్జి, మాజీ ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి కూరగాయలు పంపిణీ చేశారు. లాక్ డౌన్ నిబంధనలు ప్రజలంతా తూచా తప్పకుండా పాటించాలని కోరారు.
కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించడం మనందరి బాధ్యతని ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా రాజంపేట పురపాలికలోని మన్నూరులో, మండలంలోని కూచివారిపల్లిలో నిరుపేదలకు కూరగాయలను, నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. కరోనా నివారణ కోసం ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న నియమనిబంధనలు పాటించాలని కోరారు.
ఇదీ చూడండిఉల్లిసాయంతో లాక్డౌన్లో 1200 కి.మీ జర్నీ!