కడపలో భారీ చోరీ జరిగింది. ఫ్రెండ్స్ కాలనీకి చెందిన షెక్ అహ్మద్ బాష తన ఇంట్లోని బీరువాలో దాచిపెట్టిన 27 తులాల బంగారం, రూ.5.27 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. దీనిపై అహ్మద్ బాషా కడప తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు జాగిలాలతో చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తెలిసిన వ్యక్తులే చోరికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లలేదని బాధితుడు తెలిపాడు.
కడపలో భారీ చోరీ...కేసు నమోదు - kadapa district latest news
కడప తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 27 తులాల బంగారు నగలు, రూ.5.27 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కడపలో భారీ చోరీ