లాక్డౌన్ కారణంగా బంగారు షాపులు మూతపడటంతో స్వర్ణకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో దాదాపు 100 కుటుంబాలు స్వర్ణకార వృత్తిపైనే ఆధారపడి బతుకుతున్నాయి. ప్రస్తుతం బంగారు ఆభరణాల తయారీ దుకాణాలు మూతపడటంతో కుటుంబాలను పోషించుకునేందుకు అవస్థలు పడుతున్నారు. బంగారు ఆభరణాల తయారీపై ఆధారపడి సుమారు 40 చిన్న దుకాణాలు ఉన్నట్లు స్వర్ణకారులు తెలిపారు. ప్రభుత్వం చిన్న చిన్న బంగారు దుకాణాలు తెరుచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. నిత్యావసర దుకాణాలకు సమయం ఇచ్చినట్లే, తమ దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
లాక్డౌన్... స్వర్ణకారులకు కష్టకాలం
బంగారాన్ని మరింత అందంగా తయారు చేసే స్వర్ణకారులు ఇప్పుడు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దుకాణాలు మూతపడటంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు.
కష్టాలు పడుతున్న స్వర్ణకారులు