ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

theft: అలా వచ్చారు... ఇలా దోచేశారు..! - కడప జిల్లాలో నేర వార్తలు

కడప జిల్లా(kadapa district) నబీ కోటలో మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అనంతరం ద్విచక్రవాహనంపై పారిపోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

theft
theft

By

Published : Nov 14, 2021, 11:56 AM IST

కడప జిల్లా(kadapa district) నబీ కోటలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును(Gold chain theft) అపహరించారు. నబీ కోటకు చెందిన లక్ష్మీదేవి తన స్కూటీపై నీటి శుద్ధి కేంద్రం వద్దకు వెళ్లి.. నీళ్లు పట్టుకొని ఇంటికి వచ్చింది.

నీటి క్యాన్ దించుతున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి.. ఆమె మెడలో ఉన్న 2.7 గ్రాములు బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. చోరీకి గురైన బంగారు గొలుసు రూ.80 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.

ఇదీ చదవండి

VIVEKA MURDER CASE: నేర అంగీకారపత్రంలో దస్తగిరి సంచలన విషయాలు

ABOUT THE AUTHOR

...view details