ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లికి నిరాకరించిందని యువతి కిడ్నాప్​

తనతో పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువతిని కిడ్నాప్​ చేసి, ఆమె చనిపోయినట్లు చిత్రీకరించాలని చూశాడో ప్రబుద్ధుడు. పోలీసులు చాకచక్యంగా 10 గంటల్లోనే ఈ కేసును ఛేదించిన యువతిని కాపాడారు. నిందితుడిని అరెస్టు చేశారు.

girl kidnapped at kadapa
కడపలో పెళ్లికి నిరాకరించిందని యవతి కిడ్నాప్​

By

Published : Feb 28, 2020, 11:55 AM IST

కడపలో పెళ్లికి నిరాకరించిందని యవతి కిడ్నాప్​

ప్రస్తుతం సచివాలయంలో వార్డు కార్యదర్శిగా పని చేస్తున్న కృష్ణ మోహన్ ఒకప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేసేవాడు. అప్పటికే పెళ్లి అయ్యి, పిల్లలు ఉన్న కృష్ణమోహన్​ అదే కళాశాలలో చదువుతున్న ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. తనను పెళ్లి చేసుకోవాలని తరుచూ ఆ యువతిని వేధిస్తుండేవాడు. యువతి నిరాకరించడంతో కిడ్నాప్​కు పథకం రచించాడు. నిన్న రాత్రి ఆమె ఇంటికి వెళ్లి.. ఇంట్లో పెట్రోల్ పోసి, గ్యాస్ సిలిండర్ వెలిగించి బలవంతంగా ఆ యువతిని కిడ్నాప్ చేశాడు. నిందితుడు తన వెంట తీసుకెళ్లిన పుర్రెను, ఎముకలను ఆ మంటల్లో వేసి యువతి చనిపోయిందని స్థానికులను నమ్మించాలని చూశాడు. కుట్రను ఛేదించిన పోలీసులు కిడ్నాప్​కు గురైన యువతిని కాపాడి, నిందితున్ని అరెస్టు చేశారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details