పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరుతూ విద్యార్థులు ర్యాలీ చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఈనాడు -ఈటీవి భారత్, డివైఎఫ్ఐ సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల నుంచి ఆర్డీఓ కార్యాలయం.... పాత బస్టాండ్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. ప్లాస్టిక్‌ను నిషేధించాలని కోరుతూ విద్యార్థులు నినాదాలు చేశారు. ఇటీవల కాలంలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ కావడం వల్ల మనుషులతో పాటుగా పశువులు... మొక్కలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయండి..పర్యావరణాన్ని కాపాడండి - Get rid of the plastic monster — protect the environment.
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినియోగాన్ని నిషేధించాలని కోరుతూ కడప జిల్లావ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించారు.
ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయండి-పర్యావరణాన్ని కాపాడండి.
TAGGED:
PLASTIC AWARENESS RALLY