కరోనా రెడ్ జోన్ ఏరియాగా ప్రకటించిన కడప జిల్లా వేంపల్లిలో ఎస్పీ అన్బురాజన్ పర్యటించారు. లాక్డౌన్ నిబంధనలను ప్రజలు ఉల్లంఘించటంపై ఆయన మండిపడ్డారు. ప్రజలు రోడ్లపై తిరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ సిబ్బందిని ప్రశ్నించారు. రోడ్లపైకి వచ్చే వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరకులను ఇంటి వద్దకే పంపిస్తామని తెలిపారు.
'రోడ్లపైకి వచ్చే వాహనాలు సీజ్ చేయండి' - కడపలో కరోనా కేసులు
లాక్డౌన్ నిబంధనలు పాటిస్తేనే కరోనాను తరిమికొట్టే వీలుంటుందని కడప ఎస్పీ అన్బురాజన్ వ్యాఖ్యనించారు. కరోనా రెడ్ జోన్ ఏరియాగా ప్రకటించిన వేంపల్లిలో పర్యటించిన ఆయన...లాక్డౌన్ అమలుపై ఆరా తీశారు.
'రోడ్లపైకి వచ్చి వాహనాలు సీజ్ చేయండి