కొందరు వ్యక్తులు పేలుడు పదార్థాలు తరలిస్తున్నారన్న సమాచారం అందుకున్న కడప పోలీసులు.. పోరుమామిళ్ల దగ్గర దాడులు చేశారు. 275 జిలెటెన్ స్టిక్స్, 375 మీటర్ల వైరును స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు - కాశీనాయన రహదారుల్లో చేసిన ఈ తనిఖీల్లో.. ఓ ద్విచక్రవాహనాన్ని సోదా చేయగా నిందితులు పట్టుబడ్డారు. రామ్‌నాయక్, నాగరాజు అనే వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కడప జిల్లాలో భారీగా జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం - jilletin sticks captured by kadapa district police
ద్విచక్రవాహనంలో తరలిస్తున్న 275 జిలెటిన్ స్టిక్స్‌ను కడప జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
![కడప జిల్లాలో భారీగా జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4073470-thumbnail-3x2-gelatin1.jpg)
కడప జిల్లాలో భారీగా జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం
Last Updated : Aug 8, 2019, 1:03 PM IST
TAGGED:
AP LATEST NEWS