కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో 40వ జాతీయ రహదారిపై శాసనమండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి బందోబస్తులో ఉన్న వాహనం బోల్తా పడింది. ప్రభాకర్‌రెడ్డి విమానాశ్రయానికి వెళ్లేందుకు కడపకు వెళ్తుండగా ఆళ్లగడ్డ దగ్గరకు వచ్చేసరికి వాహనం టైరు పేలిపోయి, బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ప్రభాకర్ రెడ్డి కుమారుడు ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
గంగుల కాన్వాయ్ వాహనం బోల్తా... ముగ్గురు పోలీసులకు గాయాలు - gangula canvoy accident at allagadda
శాసన మండలి విప్ గంగుల ప్రభాకర్‌రెడ్డి కాన్వాయ్ వాహనం బోల్తా పడింది. ఆళ్లగడ్డ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
గంగులు కాన్యాయ్ వాహనం బోల్తా