కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో గండికోట జలాశయ నిర్వాసితుల ఆందోళన 16వ రోజుకు చేరుకుంది. కళ్ళకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వాసితులు నినాదాలు చేశారు. కరోనా కారణంగా పోలీసులు ఆంక్షలు విధించడంతో స్థానిక ప్రైవేటు పాఠశాలలో నిర్వాసితులు నిరసన చేపట్టారు. మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఆందోళన కొనసాగించారు. ముంపు బాధితులందరికీ పరిహారం ఇవ్వటంతోపాటు, ఇళ్ల నిర్మాణానికి గడువు ఇవ్వాలని కోరారు. నిర్వాసితులకు స్థానిక సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు.
'గండికోట ముంపు బాధితులందరికీ పరిహారం ఇవ్వాలి' - గండికోట తాజావార్తలు
గండికోట జలాశయ నిర్వాసితుల ఆందోళన కొనసాగుతోంది. ముంపు బాధితులందరికీ పరిహారం ఇవ్వటంతోపాటు, ఇళ్ల నిర్మాణానికి గడువు ఇవ్వాలని కోరుతూ బాధితులు నిరసన తెలియజేశారు.

గండికోట ముంపు బాధితులందరికీ పరిహారం ఇవ్వాలి