కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో గండికోట నిర్వాసితుల ఆందోళన 14వ రోజుకు చేరుకుంది. కరోనా కారణంగా పోలీసులు ఆంక్షలు విధించారు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో నిర్వాసితులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ అమరావతి తరహాలో ఆందోళన కొనసాగించారు. ముంపు బాధితులందరికీ పరిహారం అందజేసి, ఇళ్ల నిర్మాణానికి గడువు ఇవ్వాలని కోరారు. బుధవారం సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు నిర్వాసితులకు సంఘీభావం తెలియజేసి నినాదాలు చేశారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 12.6 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
14వ రోజుకు చేరిన గండికోట నిర్వాసితుల నిరసన - గండికోట నిర్వాసితులు తాజా వార్తలు
కడప జిల్లా తాళ్ల పొద్దుటూరు గ్రామంలో గండికోట నిర్వాసితుల నిరసన 14వ రోజుకు చేరుకుంది. పరిహారం అందజేయాలని బాధితులు డిమాండ్ చేశారు.
![14వ రోజుకు చేరిన గండికోట నిర్వాసితుల నిరసన Gandikota residents protest on the 14th day](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8826268-579-8826268-1600274998849.jpg)
14వ రోజుకు చేరిన గండికోట నిర్వాసితుల నిరసన