కుళ్లిన పంట పొలాల్లో నుంచుని.. గండికోట జలాశయ నిర్వాసితులు ఆందోళన కొనసాగించారు. కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరులో 59 రోజులుగా బాధితులు నిరసనలు చేపడుతున్నారు. బీసీ, ఎస్సీ కాలనీల్లోని చాలా ఇళ్లు ఇప్పటికే నీట మునగగా.. గండికోట వెనుక జలాలు రోడ్లపైకి వచ్చి చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కుళ్లిన పంట పొలాల్లో గండికోట నిర్వాసితుల ఆందోళన - కొండాపురంలో గండికోట నిర్వాసితుల నిరసన
కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరులోని కొన్ని కాలనీలు.. గండికోట జలాశయ వెనుక జలాలతో నీట మునిగాయి. ముంపు సమస్య పరిష్కరించే వరకు నిల్వ సామర్థ్యం తగ్గించాలని గండికోట నిర్వాసితులు డిమాండ్ చేశారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని నినదించారు.
గండికోట జలాశయ నిర్వాసితుల ఆందోళన
జలాశయంలో 18 టీఎంసీల నీరు నిల్వచేయడంతో.. గ్రామంలోని పలు కాలనీలు నీట మునిగాయని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు సమస్యను పరిష్కరించే వరకు నిల్వ సామర్థ్యం తగ్గించాలని డిమాండ్ చేశారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి.. ఇళ్ల నిర్మాణానికి రెండేళ్ల గడువు ఇవ్వాలన్నారు. వెలుగొండ తరహాలో ప్యాకేజీ ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:జగన్‌ది వైఎస్ఆర్ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ: తులసిరెడ్డి