ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

40వ రోజు చేరుకున్న గండికోట జలాశయం నిర్వాసితుల ఆందోళన

కడప జిల్లా తాళ్ల పొద్దుటూరు గండికోట జలాశయం నిర్వాసితులు చేస్తున్న ఆందోళన 40వ రోజుకు చేరింది. సిద్ధార్థ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఆందోళన కొనసాగించారు.

Gandikota Reservoir Residents Concerned Reaching 40th Day
40వ రోజు చేరుకున్న గండికోట జలాశయం నిర్వాసితుల ఆందోళన

By

Published : Oct 12, 2020, 7:46 PM IST

కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరులో గండికోట జలాశయం నిర్వాసితులు చేస్తున్న ఆందోళన 40వ రోజుకు చేరింది. తాళ్ల ప్రొద్దుటూరులోని సిద్ధార్థ ప్రైవేట్ పాఠశాల ఆవరణలో ఆందోళన కొనసాగించారు. ఎస్సీ కాలనీలో జలాలు ముంచెత్తుతున్నాయి. రోడ్ల పైకి నీరు వచ్చి చేరుతున్నాయి. ముంపు సమస్య పరిష్కరించకుండా గండికోట జలాశయంలో 16టీఎంసీల నీరు నిల్వ చేయటంతో కాలనీలు నీట మునుగుతున్నాయని... ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు సమస్యలు పరిష్కరించేంత వరకు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గించాలని పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి ఇళ్ల నిర్మాణానికి రెండేళ్ల గడవు ఇవ్వాలని కోరారు. యువతకు కట్ ఆఫ్ తేదిని పెంచాలని...వెలుగొండ ప్రాజెక్టు తరహా ప్యాకేజీ ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details