ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిండు కుండలా గండికోట జలాశయం

కడప జిల్లాలోని గండికోట జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. ప్రాజెక్టు నిండు కుండలా తలపిస్తుంది. పరిసర ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు సంవత్సరాల పాటు కడప, చిత్తూరు, అనంతపురం ప్రాంతాలకు తాగు, సాగు నీరు పుష్కలంగా లభించనుందని అధికారులు పేర్కొన్నారు.

Gandikota Reservoir in Kadapa District is completely flooded
నిండు కుండలా తలపిస్తున్న గండికోట జలాశయం

By

Published : Dec 22, 2020, 12:35 PM IST

కడప జిల్లాలో గండికోట జలాశయాన్ని కట్టిన తరువాత మొదటి సారిగా నిండుకుండలా తలపిస్తోంది. చూపరులను ఆకట్టుకుంటోంది. పరిసర ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26 టీఎంసీలు కాగా.. పూర్తి స్థాయి నీటి మట్టం నమోదైంది. మరో రెండు సంవత్సరాల పాటు కడప, చిత్తూరు, అనంతపురం ప్రాంతాలకు తాగు, సాగు నీరు పుష్కలంగా లభించనుందని అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details