ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సమస్యలు పరిష్కరించిన తర్వాతే జలాశయంలో నీళ్లు నింపాలి ' - గండికోట జలాశయం నిర్వాసితుల ఆందోళన

కడప జిల్లా తాళ్లప్రొద్దుటూరులో గండికోట నిర్వాసితుల దీక్షలు కొనసాగుతున్నాయి. తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే జలాశయంలో నీరు నింపాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు.

gandikota project victims protest in thallaproddhutooru kadapa district
తాళ్లప్రొద్దుటూరులో గండికోట నిర్వాసితుల ఆందోళన

By

Published : Oct 7, 2020, 4:30 PM IST

సమస్యల పరిష్కారం కోసం కడప జిల్లా కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరులో గండికోట నిర్వాసితులు చేస్తున్న దీక్షలు 35వ రోజుకు చేరాయి. తమ సమస్యలను పరిష్కరించిన తర్వాతే జలాశయంలో నీళ్లు నింపాలని వారు డిమాండ్ చేశారు. తాళ్ల పొద్దుటూరు గ్రామంలోని బీసీ, ఎస్సీ కాలనీలో వెనక జలాలు చేరటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. పునరావాస కాలనీల్లో సదుపాయాలు మెరుగుపరచాలని, వెలుగొండ తరహా ప్యాకేజీ కల్పించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details